టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది
టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ప్యాట్ కమిన్స్ బృందం.. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆస్ట్రేలియా జట్టును ఉద్ధేశించి మాట్లాడారు. రోహిత్ సేనను చూసి ఆస్ట్రేలియా భయపడుతోందని, సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులువేమీ కాదని తెలిపారు.
18 మంది ప్లేయర్లతో ఆస్ట్రేలియా ఎప్పుడు రాలేదు
ఆస్ట్రేలియా 18 మంది సభ్యులతో భారత్ పర్యటనకు వచ్చిందని, టీమిండియా సిరీస్ అంటే వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో చెప్పడానికే ఇదొక్కటి చాలని, గతంలో ఎప్పుడూ కూడా 18 మంది ప్లేయర్లతో ఆసీస్ ఇండియాకు వచ్చింది లేదని మహ్మద్ కైఫ్ తెలిపారు. గబ్బాలో అడినప్పుడు విరాట్ కోహ్లీ లేడని, కానీ ఇప్పుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని, ఆస్ట్రేలియా కూడా బలమైన జట్టేనని, కానీ టీమిండియాను ఓడించడం అంత సులువేమీ కాదని కైఫ్ తెలియజేశారు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ రాణించగలరని కైఫ్ ధీమా వ్యక్తం చేశారు