Page Loader
స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కింగ్ కోహ్లీకి కష్టమే..!
ఆస్ట్రేలియా జట్టుపై ఏడు సెంచరీలు నమోదు చేసిన కింగ్ కోహ్లీ

స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కింగ్ కోహ్లీకి కష్టమే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2023
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పాటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. టెస్టులో కూడా అదే ఫామ్ కొనసాగిస్తే భారత్ విజయానికి అడ్డు ఉండదు. కోహ్లీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో 20 టెస్టులాడి 48.05 సగటుతో 1682 పరుగులు చేశాడు. ఇందులో ఆసీస్‌పై ఏడు సెంచరీలు చేసి సత్తా చాటాడు. కింగ్ కోహ్లీ స్పిన్ బౌలింగ్ లో ఇంకా మెరుగు పడాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియా స్పిన్నర్లు లియోన్, అగర్ బౌలింగ్ పై కోహ్లీ దృష్టి సారించాలన్నారు.

కోహ్లీ

స్పిన్ విభాగంలో కోహ్లీ రాణించాలి

ఆస్ట్రేలియా స్పిన్నర్ల బౌలింగ్ విభాగంలో కోహ్లీ స్ట్రైక్ రేటు కాస్త తగ్గిందని, దాన్ని మెరుగుపరుచుకొని కోహ్లీ దూకుడుగా ఆడాలని ఇర్ఫాన్ ఫఠాన్ తెలిపారు. ముఖ్యంగా నాథన్ లయన్ బౌలర్ ఉన్నప్పుడు కోహ్లీ ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఫిబ్రవరి 9 నుంచి భారత్‌, ఆసీస్‌ మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ (బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9-13 మధ్య నాగ్‌పుర్‌ వేదికగా తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టుకు దిల్లీ, మూడో టెస్టుకు ధర్మశాల, నాలుగో టెస్టుకు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.