Page Loader
ఆస్ట్రేలియాకు భారీ షాక్, తొలిటెస్టుకు ఆల్ రౌండర్ దూరం
కామెరాన్ గ్రీన్ ఇప్పటివరకు 18 టెస్టుల్లో ఆడాడు

ఆస్ట్రేలియాకు భారీ షాక్, తొలిటెస్టుకు ఆల్ రౌండర్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2023
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో టెస్టు ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నాడు.బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో కామెరాన్ గ్రీన్ గాయపడడం విషయం తెలిసిందే. ఫిట్ నెస్ నిరూపించుకోవడానికి గ్రీన్ కొద్ది రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో గ్రీన్ తొలి టెస్టులో ఆడే అవకాశం లేదని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపారు. భారత్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. గ్రీన్‌కు టెస్టులో మంచి రికార్డు ఉంది.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా టెస్టు జట్టులోని సభ్యులు

గ్రీన్ టెస్టులో 2020 డిసెంబర్‌లో అరంగేట్రం చేశాడు. 18 టెస్టులో 806 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలున్నాయి. బౌలింగ్ విభాగంలో 23 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా గ్రీన్ 140 కిలోమిటర్ల వేగంతో బంతిని విసిరే సత్తా ఉంది. భారత్తో సిరీస్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 13 వరకు గ్రీన్ బౌలింగ్‌కు దూరంగా ఉండనున్నాడు. ఐపీఎల్ 2023 వేలంలో గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ ఎంపిక చేసింది. ముంబాయి తరుపున కొన్ని ఇన్నింగ్స్ లు గ్రీన్ దూరం కానున్నాడు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్‌కమ్మిన్స్ (సి), అగర్, స్కాట్‌బోలాండ్, అలెక్స్‌కారీ, కామెరాన్‌గ్రీన్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, హేజిల్‌వుడ్, ట్రావిస్‌హెడ్, ఖవాజా, లాబుస్‌చాగ్నే, లియోన్, మోరిస్, టాడ్‌మర్ఫీ, మాథ్యూ రెయిన్‌వేషాస్మిత్ (VC), మిచెల్‌స్టార్క్, స్వెప్సన్, వార్నర్