
ఎరిన్ హాలండ్‌ను చంకన ఎత్తుకున్నన్యూజిలాండ్ మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అద్భుత బౌలింగ్‌తో మేటీ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐపీఎల్ టోర్నిలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యాతలలో కూడా డానీ ఒకరు. అలాంటి డానీ ఒక్కోసారి తన వింత ప్రవర్తనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు
తాజాగా పీఎస్ఎల్ లీగ్‌లో ఓ ఘటనపై డానీ ట్రోల్‌కి గురయ్యాడు. ప్రెజెంటర్ ఎరిన్ హాలండ్‌ని చక్కనెత్తుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
2013లో జరిగిన ఐపీఎల్ సీజన్లో డానీ, యాంకర్ కరిష్మా కోటక్‌ని షో జరుగుతుండగా మైదానంలో ఎత్తుకొని విమర్శలు గురైన విషయం తెలిసిందే.
హాలాండ్
ట్విట్టర్‌లో 'ఐ లవ్ యూ ఆంకుల్'
PSL 2023లో ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రెజెంటర్ హాలండ్‌ను డానీ ఎత్తుకున్నాడు. ఈ ఘటనపై హాలాండ్ తాజాగా ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఐ లవ్ యూ అంకుల్ అంటూ శీర్షకను పెట్టింది.
మ్యాచ్ విషయానికొస్తే మొహమ్మద్ నవాజ్, నజీబుల్లా జద్రాన్, ఉమర్ అక్మల్‌ల అద్భుత ప్రదర్శనతో మొదట బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు ఇస్లామాబాద్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.
డానీ మోరిసన్ వన్డే క్రికెట్‌ను భారత్‌పైనే అరంగేట్రం చేశారు. కివీస్ తరఫున డానీ 48 టెస్టులు, 96 వన్డేలు ఆడారు.