ఇంగ్లండ్ జోరుకు న్యూజిలాండ్ బ్రేకులు వేసేనా..?
టెస్టులో ఇంగ్లండ్ దుమ్ము దులుపుతోంది. న్యూజిలాండ్ పై మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 267 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసింది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ తొలి విజయాన్ని అందుకొని చరిత్రను సృష్టించింది. ఫిబ్రవరి 24న రెండో టెస్టు సిరీస్ ప్రారంభ కానుంది. ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. మరోపక్క ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ కన్నేసింది. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో రెండు టెస్టు జరగనుంది. ఈ వేదికపై ఇప్పటివరకు 66 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఈ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈమ్యాచ్ సోనీస్పోర్ట్స్ నెట్‌వర్క్ ఉదయం 3:30గంటలకు ప్రసారం కానుంది.
ఇరు జట్లలోని సభ్యులు
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 111 టెస్టులు మ్యాచ్ జరిగాయి. ఇందులో ఇంగ్లండ్ 52 మ్యాచ్‌లను గెలిచింది. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్ 3-0తో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో విజృంభిస్తున్నారు. వీరిని న్యూజిలాండ్ బ్యాటర్లు ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాల్సిందే. న్యూజిలాండ్ : టామ్‌లాథమ్, డెవాన్‌కాన్వే, విలియమ్సన్, నికోల్స్, మిచెల్, టామ్ బ్లండెల్, బ్రేస్‌వెల్, హెన్రీ, టిమ్ సౌతీ (కెప్టెన్), వాగ్నర్, టిక్నర్. ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్‌క్రాలీ, బెన్‌డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జిమ్మీ ఆండర్సన్.