Page Loader
టెస్టుల్లో రికార్డు క్రియేట్ చేసిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ 11 టెస్టుల్లో 10 మ్యాచ్‌లను గెలిచింది

టెస్టుల్లో రికార్డు క్రియేట్ చేసిన ఇంగ్లండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2023
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టులో ఇంగ్లండ్ సంచలనాత్మక రికార్డును క్రియేట్ చేస్తోంది. ప్రధాన్ కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచి టెస్టులో అద్భుతంగా రాణిస్తోంది. ఒకప్పుడు టెస్టులో పేలవ ఫామ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్.. ఇప్పుడు టెస్టులో రికార్డులను సృష్టిస్తోంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లపై టెస్టు సిరీస్‌లను గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. వీటి విజయంలో బ్రెండన్ మెకల్లమ్, బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించారు. బాజ్ బాల్ విధానంతో టెస్టులో ఇంగ్లండ్ దూసుకెళ్లుతోంది. ఇంగ్లండ్ స్వదేశంలో న్యూజిలాండ్‌ను 3-0తో ఓడించింది. తొలిసారిగా ఇంగ్లండ్ పాక్‌లో టెస్టు సిరీస్‌ను (3-0)తో క్లీన్‌స్వీప్ చేసింది. ఓవరాల్‌గా పాక్ గడ్డపై ఇంగ్లండ్ ఐదో టెస్టు విజయాన్ని నమోదు చేసింది.

ఇంగ్లండ్

112 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్

జూన్ 2022లో ఇంగ్లండ్ స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 'బాజ్‌బాల్' విధానానికి నాంది పలికింది. అప్పటి నుండి ఇంగ్లండ్ 11 టెస్టుల్లో 10 గెలిచింది. ఈ కాలంలో మరే ఇతర జట్టు కూడా ఆరు టెస్టు విజయాలు సాధించలేదు. ఇంగ్లండ్ సాధించిన విజయాల్లో ఆరు స్వదేశంలో కాగా.. నాలుగు విదేశాల్లో నమోదయ్యాయి. స్టోక్స్ సారథ్యంలో గతేడాది ఇంగ్లండ్ తొమ్మిది టెస్టులు గెలిచింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టు కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ (2016)తో సమం చేశాడు. ఇంగ్లండ్ 112 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేసింది. మొదటి టెస్టు తొలి రోజున 500 పైగా పరుగులు చేసిన మొదటి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.