Page Loader
27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న సౌతాఫ్రికా

27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2023
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సౌతాఫ్రికా 50 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. వాన్ డెర్ డస్సెన్ 117 బంతుల్లో 111 పరుగులు, డేవిడ్ మిల్లర్ 53 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 44.2 ఓవర్లకు 271 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాసన్ రాయ్, డేవిడ్ మలన్ శుభారంభం అందించారు. ఓపెనర్లు జాసన్ రాయ్, డేవిడ్ మలన్ ఇంగ్లండ్‌కు శుభారంభం అందించారు. జాసన్ రాయ్ 113 పరుగులు, డేవిడ్ మలన్ 59 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది

వాన్ డెర్ డస్సెన్

వాన్ డెర్ డస్సెన్ సాధించిన రికార్డులివే

వాన్ డెర్ డస్సెన్ వన్డేల్లో నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ఇంగ్లాండ్ పై అతనికి ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. స్వదేశంలో ఆడిన వన్డేలో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి. వాన్ డెర్ డుస్సెన్ ఇప్పటివరకు 39 వన్డేలు ఆడగా 90.23 స్ట్రైక్ రేట్‌తో 1,636 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 150వ వన్డేలో నిలిచిన అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు. తన కెరీర్లో వన్డేలో ఇప్పటివరకు 3709 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు చేశాడు.