NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ
    తదుపరి వార్తా కథనం
    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ
    58 బంతుల్లో 113 పరుగులు చేసిన డుప్లెసిస్

    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 25, 2023
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు ఫాప్ డుప్లెసిస్ దుమ్మురేపుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన డర్బన్స్ సూపర్ జెయింట్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు.

    86 బంతుల్లో 8ఫోర్లు, 8 సిక్సర్లతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. దీంతో జోబర్గ్ సూపర్ కింగ్స్ 8 వికెట్లతో డర్బన్స్ సూపర్ జెయింట్స్‌ను ఓడించింది.

    వాండరర్స్ స్టేడియంలో 179 పరుగుల ఛేదనకు దిగిన సూపర్ కింగ్స్ ఓపెనర్లు డు ప్లెసిస్, రీజా హెండ్రిక్స్ ఓపెనింగ్ వికెట్‌కు 157 పరుగులు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    డుప్లెసిస్

    అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు

    డు ప్లెసిస్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 46.17 సగటుతో 277 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పార్ల్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్ (285) పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.

    ఏడు మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీ-ఫైనల్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.

    డుప్లెసిస్ ఇప్పటివరకూ 325 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 31.18 సగటుతో 8,514 పరుగులు సాధించి రికార్డు సాధించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    క్రికెట్

    శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన మహ్మద్ సిరాజ్ భారత జట్టు
    న్యూజిలాండ్ సిరీస్ పై భారత్ గురి..! భారత జట్టు
    ఉమెన్స్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7కోట్లు ఐపీఎల్
    షఫాలి వర్మ సూపర్ బ్యాటింగ్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025