Page Loader
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో వర్షాలు

Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బుధవారం, గురువారం రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయనున్నట్లు పేర్కొంది. అలాగే హైదరాబాద్‌ సహా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక!