టెస్టులో కొత్త రికార్డు సృష్టించిన బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టులో సరికొత్త రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ జరుగుతున్న ఓపెనింగ్ టెస్టులో బెన్ స్టోక్స్ ఈ మైలురాయిని సాధించాడు. మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును బెన్ స్టోక్స్ అధిగమించాడు. టెస్టులో అత్యధిక సిక్సర్లు (107) సాధించిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డను చెరిపేశాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ 109 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్లో 398 సిక్సర్లను బాదాడు. వాటిలో టెస్టులో 107 సిక్సర్లను కొట్టాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు.
బెన్ స్టోక్స్ సాధించిన రికార్డులివే
బెన్ స్టోక్స్ రెండో ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో న్యూజిలాండ్ బౌలర్ స్కాట్ కుగ్గెలీజ్ ఓవర్‌లో మూడో బంతిని ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టి ఈ సరికొత్త రికార్డు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో 33 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 90వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బెన్ స్టోక్స్ 12 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 5,652 పరుగులు చేశాడు.గతేడాది ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా స్టోక్స్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 101 టెస్టులు ఆడిన బ్రెండన్ మెక్ కల్లమ్ 107 సిక్సర్లు బాదాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రస్తుతం మెక్ కల్లమ్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు