
టెస్టు మ్యాచ్‌ని వన్డేలా ఆడిన ఇంగ్లండ్
ఈ వార్తాకథనం ఏంటి
రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. డే-నైట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం 58.2 ఓవర్లలో 325/9 వద్ద డిక్లరేషన్ చేసింది. ఇంకా ఒక వికెట్ చేతిలో ఉన్నా ఉన్నా కూడా డిక్లరేషన్ చేయడం గమనార్హం. ఓపెనర్ జాక్ క్రాలీ (4) ఆరంభంలోనే ఔటైపోయినా.. డకెట్ (68 బంతుల్లో 84 పరుగులు), ఓలీ పోప్ (65 బంతుల్లో 42), హారీ బ్రూక్స్ (81 బంతుల్లో 89 పరుగులు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీ మోత మోగించేశారు.
మిగిలిన వాళ్లు కూడా క్రీజులో ఉన్నంతసేపు డిఫెన్స్‌కి ఆడకుండా పరుగుల రాబట్టడానికి ప్రయత్నించారు. అయితే బ్రూక్, బెన్‌ఫోక్స్ ఆరో వికెట్‌కు 89 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది.
బ్రూక్
బౌండరీల వర్షం కురిపించిన బ్రూక్
డకెట్, పోప్ బౌండరీల మోత మోగించడంతో ఇంగ్లండ్ 19 ఓవర్లలో 118/2 స్కోరు చేసింది.
ఇంగ్లాండ్ 152/3 ఉన్నప్పుడు బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బ్రూక్ 81 బంతుల్లో 89 (15 ఫోర్లు, 1 సిక్స్)తో బౌండరీల వర్షం కురిపించాడు.మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో 81.29 సగటుతో 569 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో వాగ్నెర్ 250 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
కివీస్ బౌలర్లలో వాగ్నర్ 4, సౌథీ, కుగ్గెలెన్ తలో 2, టిక్నర్ ఓ వికెట్ పడగొట్టాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 37 పరగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. కాన్వే (17), వాగ్నర్ (4) క్రీజ్‌లో ఉన్నారు