ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటనున్న గుజరాత్ జెయింట్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ముంబైలో అట్టహాసంగా ముగిసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీగార్డనర్ ను గుజరాత్ జెయింట్స్ అధిక ధరకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్ ఆధారిత ఫ్రాంచైజీ అయిన ఇందులో బెత్ మూనీ, డియాండ్రా డాటిన్, స్నేహ్ రానా కూడా ఉన్నారు. వీరందరి చేరికతో గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనపడుతోంది. గుజరాత్ జెయింట్స్ ఈ వేలంలో 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి 11.5 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 12మంది భారత ప్లేయర్లు, ఇరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గార్డనర్, మూనీ, రానా జట్టులో కీలక ప్లేయర్స్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
గుజరాత్ జెయింట్స్ జట్టు ఇదే
గుజరాత్‌కు కెప్టెన్సీ వహించడానికి ముందు వరుసలో భారత ఆల్ రౌండర్ రానా ఉంది. ఆమె జనవరి 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. మరోవైపు ప్రాంచైజీ గార్డనర్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. గార్డనర్ 68 మ్యాచ్‌ల్లో 1,069 పరుగులు చేసింది. బౌలింగ్ విభాగంలో 48 వికెట్లు పడగొట్టింది. జట్టు: ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డోటిన్, స్నేహ రాణా, ఎస్ మేఘన, జార్జియా వేర్‌హామ్, మాన్సీ జోషి, డి హేమలత, మోనికా పటేల్, తనుజా కన్వర్, సుష్మా వర్మ, హర్లీ కుమారి గాలా, అశ్వని కుమారి, పరునికా సిసోడియా, షబ్నిమ్ షకీల్.