
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఇప్పటివరకు ఒకసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేదు. అయితే ఈసారి ఉమెన్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే కీలకమైన ఆటగాళ్లను ఫ్రాంచేజీ కొనుగోలు చేసింది.
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు అత్యధిక ధర చెల్లించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు ఎల్లీస్‌ఫెర్రి, మేగాన్ ఘట్‌లతో జట్టుకు మరింత బలం చేకూరనుంది.
ఆర్సీబీ ఈ వేలంలో 18 మంది ఆటగాళ్ల కోసం 11.9 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 12 మంది భారత ఆటగాళ్లు, ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు.
మార్చి 4 నుంచి 26 ఉమెన్స్ ఐపీఎల్ మొదటి ఎడిషన్‌ను నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు ముంబైలోని DY పాటిల్, క్రికెట్‌క్లబ్ ఆఫ్ఇండియా స్టేడియాల్లో జరగనున్నాయి.
బెంగళూర్
బెంగళూర్ జట్టులోని సభ్యులు
ఆర్‌సిబికి కెప్టెన్ గా స్మృతి మంధాన వ్యవరించే అవకాశం ఉంది. ఒకవేళ మంధాన అవకాశం ఇవ్వకపోతే ఫెర్రిని పగ్గాలను చేపట్టనుంది. ఫెర్రీ గతంలో బిగ్ బాష్ లీగ్ సిడ్నీ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది.
జట్టు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, ఆశా శోబన, కనికా అహుజా, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతీ బోస్, పూనమ్ ఖేమ్నార్, కోమల్‌గన్ జంచుజాడ్ పవార్, హీథర్ నైట్, శ్రేయాంక పాటిల్.