ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానకు కళ్లు చెదిరే జాక్‌పాట్
మహిళల ప్రీమియర్ లీగ్ కోసం తొలిసారి జరిగిన వేలంలో అమ్మాయిలపై కనకవర్షం కురిసింది. ఇందులో భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మందాన అంచనాలకు తగ్గట్టే రూ.3.40 కోట్లకు బెంగళూర్ తీసుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ను మాత్రం రూ.2కోట్లలోపే ముంబై దక్కించుకుంది. ఇంకా విదేశీ ఆల్ రౌండర్లు ఆష్లే, స్కివర్‌లకు రూ.3.20 కోట్లు పలికారు. డబ్ల్యూపీఎల్ వేలంలో భారత డాషింగ్ ఓపెనర్ మంధాన అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. కొన్నేళ్లుగా భారత బ్యాటింగ్ లైనప్‌లో మంధాన కీలకంగా వ్యవహరిస్తోంది. WT20Iలలో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గా మంధాన నిలిచింది. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిశర్మ యూపీ వారియర్జ్‌కు సేవలను అందించనుంది. లక్నోకు చెందిన ఫ్రాంచైజీ ఆమెను 2.60 కోట్లు కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్లేయర్స్‌పై కనక వర్షం
భారత బ్యాటింగ్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ పంట పండింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.2.20 కోట్లకు తీసుకుంది. రోడ్రిగ్స్ ఇప్పటివరకు 76 మ్యాచ్‌లు ఆడి 1,628 పరుగులు చేసింది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా ఆమె నిలిచింది. స్టైలిష్ ఇండియన్ ఓపెనర్ షఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రూ. 2.00 కోట్లకు ఆమెను కొనుగోలు చేసింది. ఇటీవలే U-19 T20 ప్రపంచకప్‌ను షఫాలీ వర్మను నాయకత్వంలో టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఒక్కొక్కరిని ముంబై ఇండియన్స్ 1.90 కోట్లకు కొనుగోలు చేసింది.