ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్ దక్కింది. ఆమెను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటిపడ్డాయి. రూ.2.6కోట్లకు దీప్తిశర్మను యూపీ వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 4 నుంచి 26 వరకు జరగనున్నాయి. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియాలు వేదిక కానున్నాయి. దీప్తి శర్మ ఇప్పటి వరకు 88 టీ20 మ్యాచ్ లను ఆడింది. 26.11 సగటుతో 914 పరుగులను చేసింది. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలున్నాయి. అదే విధంగా బౌలింగ్ విభాగంలో 97 వికెట్లను పడగొట్టింది.
యూపీ వారియర్స్ తరుపున బరిలోకి దిగనున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తహ్‌లియా మెక్‌గ్రాత్‌ని కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.1 కోటి 40 లక్షలకు తహ్‌లియా మెక్‌గ్రాత్‌ని కొనుగోలు యూపీ వారియర్స్ చేసింది దీప్తిశర్మతో కలిసి ఆస్ట్రేలియా అల్‌రౌండర్ తహ్‌లియా మెక్‌గ్రాత్ కలిసి ఆడనుంది. ఇప్పటికే ఈ వేలానికి 409 మంది మహిళా క్రికెటర్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఇందులో నుంచి ఐదు ఫ్రాంఛైజీలు కలిసి అత్యధికంగా 90మంది కొనుగోలు చేయనున్నారు. ప్రతి ప్రాంఛైజీ పర్సులో రూ.12 కోట్లు ఉండనున్నాయి.