Page Loader
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జాక్ పాట్ కొట్టేదెవరో..?
దీప్తశర్మపై ఆసక్తి చూపుతున్న ఫ్రాంచేజీలు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జాక్ పాట్ కొట్టేదెవరో..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2023
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది. ఒక జట్టులో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరి నుంచి ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకుంటాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధరను పొందే అవకాశం క్రికెటర్లు ఎవరో ఇప్పడు మనం తెలుసుకుందాం. భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ విధ్యంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌ చేయగల అనుభవం ఉంది. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చాలా సందర్భాల్లో జట్టును గెలిపించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో నిలిచే అవకాశం ఉంది.

దీప్తిశర్మ

ఈ ఆటగాళ్లపై డబ్బులు కురిసే అవకాశం

గత కొన్నేళ్లుగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్ అద్భుత ఫామ్‌లో ఉంది. టీ20 క్రికెట్‌లో 1451 పరుగులు చేసింది. ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో 74 వికెట్లను పడగొట్టింది. విదేశీ ఆటగాళ్లలో తనకు అత్యధిక ధర లభిస్తుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ యాష్లీ గార్డనర్ టీ20 ర్యాకింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాట్, బాల్ రెండింటిలోనూ సత్తా చాటగలే అనుభవం ఉంది. గార్డనర్ 43 అంతర్జాతీయ వికెట్లను తీసింది. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఆమె కోసం పోటీపడే అవకాశం ఉంటుంది. దీప్తిశర్మ ఏడాది కాలంగా తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల వికెట్లు తీస్తూ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. 192 అంతర్జాతీయ వికెట్లు తీసిన అనుభవం ఉంది.దీంతో ఈ ఆల్‌రౌండర్‌పై డబ్బుల వర్షం కురిసే అవకాశం ఉంది.