ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. మార్చి 4వ తేదీ నుంచి ముంబయిలో ఐదు జట్లతో తొలి సీజన్ ప్రారంభం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని ఇండియా కన్సల్టెంట్స్ సంస్థలో భాగస్వామి అయినా మలికా అద్వానీ వేలాన్ని పర్యవేక్షించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
గతంలో హ్యూ ఎడ్మీడ్స్, రిచర్డ్ మాడ్లీ, చారు IPL వేలం నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం 409 మాత్రమే తుది జాబితాలోకి చేర్చారు. ఇక వీరిలో 264 మంది భారత ప్లేయర్లు ఉండగా.. 163 విదేశీ ఆటగాళ్లు ణ్నారు. రూ.10,20,30,40,50 లక్షల బేస్ ప్రైస్లతో క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
మార్చి 26న ఫైనల్ మ్యాచ్
ప్రతి జట్టుకు వేలంలో రూ. 12 కోట్ల పర్స్ అందుబాటులో ఉండనుంది. దీంతో తమ జట్టులోకి కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
వేలం సమయంలో ప్రతి గంటకు ఒకొసారి బీసీసీఐ బ్రేక్‌ను ఇవ్వనుంది. మార్చి 4వ తేదీన డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలలో జరగనున్నాయి.
ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముపోడే మహిళా క్రికెటర్లు ఎవరో తెలియాలంటే ఫిబ్రవరి 12 వరకు వేచి ఉండాల్సిందే.