Page Loader
ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!
ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానంగా ఉంది

ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2023
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మొదటి టెస్టు వైభవంగా ప్రారంభమైంది. అయితే మూడో టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. దీనిపై క్లారిటీ రావడం లేదు. ధర్మశాల మైదానం ఇటీవల పునరుద్ధరణకు గురైందని, కావున అంతర్జాతీయ ఆటను నిర్వహించడానికి ఈ మైదానం సరిపోదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తనిఖీ తర్వాత రాబోయే రోజుల్లో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది. దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. ధర్మశాల క్లియరెన్స్ పొందడంలో విఫలమైతే విశాఖపట్నం, రాజ్‌కోట్, పూణే, ఇండోర్ వేదికలను షార్ట్‌లిస్ట్ చేశారని సమాచారం.

టీమిండియా

టీమిండియా టెస్టు సిరీస్‌ను సాధిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది

WTC ఫైనల్‌లోకి ప్రవేశించడానికి ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు పోటీలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే WTC పాయింట్ల పట్టికలో 75.56 గెలుపు శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఇండియా 58.93శాతంతో రెండో స్థానంలో ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరగనుండగా, టీమిండియా టెస్టు సిరీస్‌లో విజయం సాధిస్తే టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. మొదటి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో సత్తా చాటాడు. అల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అర్ధ సెంచరీలతో రాణించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 144 పరుగుల అధిక్యంలో ఉంది.