మొదటి టెస్టులో అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లు
బోర్కర్ గవాస్కర్ తొలి టెస్టులో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఆసీస్ పై భారత్ అధిక్యంగా దిశగా ముందుకెళ్తోంది. ఇప్పటికే 144 పరుగుల అధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో పాటు, ఆలౌరౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడడం వల్లే టీమిండియా సత్తా చాటింది. మూడో రోజు వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తే తొలి టెస్టులో ఆసీస్ ను ఓడించే అవకాశం ఉంటుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 114 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 120 పరుగులు, రవీంద్ర జడేజా 60, అక్షర్ పటేల్ 50 పరుగులు చేయడంతో భారత్ మంచి స్కోరు చేసింది.
రెండేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ
ప్రతి సెషన్ ఆరంభంలో టీమ్‌ఇండియా వికెట్లను కోల్పోయిది. రోహిత్ తన టెస్టు కెరీర్ లో రెండేళ్ల తర్వాత సెంచరీ బాదాడు. అయితే పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోర్ కే ఔట్ అయ్యారు. జడేజా, అక్షర్ పటేల్ కలిసి ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆట మరో రెండు బంతుల్లో ముగుస్తుందనగా జడేజా ఇచ్చిన క్యాచ్‌ను స్టీవ్ స్మిత్ విడిచిపెట్టారు. ఆసీస్ తరుపున అరంగేట్రం చేసిన టాడ్ మర్ఫీ 5 వికెట్లు తీసి మెరుగ్గా రాణించాడు.