భారత్ క్రికెట్ చరిత్రలో రోహిత్‌శర్మ అరుదైన రికార్డు
భారత్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్‌కూ సాధ్యం కానీ రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటో సెంచరీ చేయడంతో ఈ ఘనతను రోహిత్ సాధించాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లోనూ సెంచరీలు సాధించిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. టెస్టులో మొత్తం 9 సెంచరీలు సాధించిన ఆటగాడి నిలిచాడు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 177 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌటైంది. టీమిండియా ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ 76 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు.
అంతర్జాతీయ కెరీర్‌లో 43 సెంచరీలు పూర్తి చేసిన హిట్ మ్యాన్
మార్చి 2022లో రోహిత్ శర్మ నాయకత్వంలో స్వదేశంలో భారత్ 2-0తో శ్రీలంకను ఓడించింది. రోహిత్ శర్మ ఇప్పటివరకూ 46 టెస్టులు ఆడాడు. ఇప్పటివరకు 3,200 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా ఆరు టెస్టు సెంచరీలతో రాణించారు. స్వదేశంలో ఆడిన టెస్టుల్లో రోహిత్ శర్మ సగటు 75 ప్లస్ ఉండడం విశేషం. స్వదేశంలో మొత్తం ఎనిమిది టెస్టు సెంచరీలు చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ తర్వాత స్వదేశంలో 250 అంతర్జాతీయ సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్ 43వ శతకాన్ని పూర్తి చేశాడు.