మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు చుక్కులు చూపించిన ఇండియా బౌలర్లు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతోన్న మొదట టెస్టులో మొదటి రోజు ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 177 పరుగులకే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి ఆసీసీ బ్యాటర్ల నడ్డి విరిచాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టి, అన్ని ఫార్మాట్‌లో 450 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున లాబుస్‌చాగ్నే 49 పరుగులు చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 77/1 స్కోరు చేసింది. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మూడు ఓవర్లలోనే ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌లను కోల్పోయింది. లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.
అర్ధ సెంచరీతో రాణించిన రోహిత్‌శర్మ
అశ్విన్ 450 టెస్ట్ వికెట్లు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా టెస్టు చరిత్రలో 450 వికెట్ల తీసిన క్లబ్‌లో చేరిన తొమ్మిదో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఆసీస్‌తో జరిగిన 19 టెస్టు మ్యాచ్‌ల్లో అశ్విన్ 90 వికెట్లు పడగొట్టాడు. 2017లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సిరీస్‌లో అశ్విన్ 21 వికెట్లు పడగొట్టాడు. జడేజా ఆస్ట్రేలియాపై 100 అంతర్జాతీయ వికెట్లను సాధించిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాపై జడేజా 50 టెస్టు వికెట్లు తీసిన రికార్డు ఉంది. రోహిత్‌శర్మ, రాహుల్ ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. తొలి ఓవర్‌లోనే రోహిత్ మూడు బౌండరీలు బాదాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులో తన 15వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు.