Page Loader
జడేజా దెబ్బకు ఆస్ట్రేలియాకు మైండ్ బ్లాంక్
మొదటి టెస్టులో ఐదు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా

జడేజా దెబ్బకు ఆస్ట్రేలియాకు మైండ్ బ్లాంక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 09, 2023
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతేడాది గాయానికి గురై కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మొదటి టెస్టులో విజృభించాడు. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఆసీస్ వెన్ను విరిచాడు. జడేజా ఐదు కీలక వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్‌లలో 100 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా మూడు ఓవర్లలోనే ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌లను కోల్పోయింది. ఆ తర్వాత లాబుషాగ్నే, స్టీవెన్‌స్మిత్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. వీరిద్దరిని జడేజా ఔట్ చేశాడు. అలెక్స్ కారీ 35 పరుగులు చేసినప్పటికీ అశ్విన్ అతనిని అవుట్ చేసి తన 450వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు.

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా అరుదైన ఘనత

నాగ్‌పూర్ టెస్టులో జడేజా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి జడేజా తిరిగొచ్చాడు. అంతకుముందు జడేజా T20 ఆసియా కప్ 2022లో ఆడాడు. శస్త్ర చికిత్స కారణంగా టోర్ని మధ్యలో వైదొలిగాడు. ఈ ఏడాది జనవరిలో తమిళనాడుతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు జడేజా సౌరాష్ట్రకు నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్ ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడిన తొమ్మిది టెస్టుల్లో 17.22 సగటుతో 54 వికెట్లను తీసి మెరుగైన రికార్డును సంపాదించాడు. ఆస్ట్రేలియాపై 100 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. అనిల్ కుంబ్లే (142), హర్భజన్ సింగ్ (129), కపిల్ దేవ్ (124), ఆర్ అశ్విన్ (118) ఈ ఘనత సాధించారు.