LOADING...
ఆరు నెలల తరువాత టీమిండియా తరుపున ఆడనున్న రవీంద్ర జడేజా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడనున్న రవీంద్ర జడేజా

ఆరు నెలల తరువాత టీమిండియా తరుపున ఆడనున్న రవీంద్ర జడేజా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2023
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా 6నెలలు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు.

రవీంద్ర జడేజా

ఫామ్‌లోకి వచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా

మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా జడేజా సెప్టెంబర్ 2022 నుంచి భారత్ తరుపున ఆడలేదు. దీంతో టీ20 ప్రపంచ కప్ కు దూరమయ్యాడు జడేజా ఫిట్ నెస్ నిరూపించుకొని ఇటీవలే రంజీ మ్యాచ్‌ల్లో ఆడాడు. సౌరాష్ట్ర తరుపున మంచి ప్రదర్శన చేశాడు. దీంతో ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఈ ఆల్ రౌండర్ ఫామ్‌లోకి రావడంతో టీమిండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా తాను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. టీ20 ప్రపంచ కప్ కు ముందు శస్త్ర చికిత్స చేయించుకోవాలా లేదా తర్వాత డైలమాలో పడ్డానని, అయితే వైద్యుల సూచన మేరకు వరల్డ్ కప్‌కు ముందే సర్జరీ చేయించుకున్నానని రవీంద్ర జడేజా చెప్పారు.