గాయం నుంచి కోలుకున్న జడేజా, కెప్టెన్‌గా రీ ఎంట్రీ
టీమిండియా ఆలౌరౌండర్ రవీంద్ర జడేజా కొన్ని నెలలుగా టీమిండియాకు దూరమయ్యాడు. ప్రస్తుతం జడేజా మళ్లీ మైదానంలో మళ్లీ అడుగు పెట్టబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్న జడేజా సౌరాష్ట్ర తరుపున రంజీ ఆడటానికి సిద్ధమయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ మ్యాచ్ కు దూరం కావడంతో సౌరాష్ట్రకు జడేజా కెప్టెన్ గా నాయకత్వం వహించనున్నాడు. నాలుగు నెలల తర్వాత జడేజా మళ్లీ మైదానంలోకి ఆడుగు పెట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టులో జడేజా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.
టెస్టులో జడేజాకు అవకాశం
జడేజా చివరి సారిగా సెప్టెంబర్ 2022లో T20 ఆసియా కప్ ఆడిన విషయం తెలిసిందే. టోర్నమెంట్ లో మధ్యలో గాయం కారణంగా జడేజా టీమిండియాకు దూరమయ్యాడు. నవంబర్ 2018 తర్వాత జడేజా తన మొదటి రంజీ ట్రోఫీని జడేజా మ్యాచ్ ఆడనున్నాడు. జనవరి 24న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో తమిళనాడుతో జరిగే టోర్నమెంట్‌లో సౌరాష్ట్రకు జడేజా కెప్టెన్ గా నాయకత్వం వహించనున్నాడు ఈ మ్యాచ్‌లో ఉనద్కత్, ఛెతేశ్వర్ పుజారాలకు విశ్రాంతి తీసుకోనున్నారు. ఫిబ్రవరి 9 నుండి ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల కోసం 17 మంది సభ్యులతో టీమిండియా జట్టును ఎంపిక చేసింది. ఇందులో జడేజాను అవకాశం కల్పించారు.