
గాయం నుంచి కోలుకున్న జడేజా రీ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు దూరమై చాలా నెలలు అవుతోంది. సెప్టెంబర్ 2022లో ఆసియా కప్ భాగంగా జడేజా మోకాలికి గాయమైంది. దీంతో భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు టెస్టులకు భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈలోపు రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర తరుపున ఆడటానికి జడేజా చైన్నై వచ్చాడు.
చైన్నైకి చేరుకున్న జడేజా వణక్కమ్ చైన్నై అంటూ ట్వీట్ చేయడంతో చైన్నై అభిమానులు ఉత్సహంతో రీ ట్వీట్ చేస్తున్నారు. సింహం మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. 'వెల్‌కమ్ బ్యాక్ సూపర్ కింగ్' అంటూ మరో అభిమాని వ్యాఖ్యానించారు.
ధోని
చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని
ప్రస్తుతం జడేజా అభిమానులు రీ ట్వీట్‌తో జడేజాకు స్వాగతం పలుకుతున్నారు.
మోకాలి గాయానికి చికిత్స అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో చేరి తన ఆటను జడేజా మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమ్‌ఇండియాకు జడేజా ఎంపికయ్యాడు.
గత ఏడాది ఐపీఎల్‌లో చెన్నై నిరాశ పరిచింది. తొలుత జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేయగా.. వరుస ఓటముల నేపథ్యంలో తిరిగి ధోనీకే ఆ బాధ్యతలను చైన్నై యాజమాన్యం అప్పగించిన విషయం తెలిసిందే.