Page Loader
రెండో వన్డేకు ముందు టీమిండియాకు భారీ జరిమానా
భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 60% జరిమానా

రెండో వన్డేకు ముందు టీమిండియాకు భారీ జరిమానా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియాకు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధిస్తున్నట్లు ఐసీపీ ప్రకటించింది. ఐసీసీ కోడ్ ఆప్ కండక్ట్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే ఒక్కో ఓవర్‌కు 20శాతం జరిమానా పడుతుంది. అయితే భారత్ జట్టు మూడు ఓవర్లు తక్కువగా వేయడంతో 60శాతం ఫైన్ విధించారు. స్లో ఓవర్ రేట్ తప్పును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించారు. హైదరబాద్ లో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియన్ టీమ్ మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించామని మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్ వెల్లడించారు.

రోహిత్ శర్మ

తప్పును ఒప్పుకున్న రోహిత్ శర్మ

కెప్టెన్ రోహిత్ శర్మ తప్పును ఒప్పుకోవడంతో దీనిపై విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించడంతో భారత్ 350 పరుగులు చేసింది. ఛేజింగ్ లో న్యూజిలాండ్ టాపార్డర్ విఫలమైంది. చివర్లో బ్రేస్ వెల్, సాంటర్న్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. తొలి వన్డే​లో గెలిచి జోష్​ మీదున్న టీమిండియా ప్లేయర్లు.. తమ రెండో మ్యాచ్‌ కోసం మ్యాచ్​ వేదికైన రాయ్​పుర్​లో అడుగుపెట్టారు. న్యూజిలాండ్ కూడా అక్కడికి చేరుకుంది.