Page Loader
న్యూజిలాండ్‌తో రెండో వన్డేకి టీమిండియా రెడీ
మొదటి వన్డేలో 12 పరుగుల తేడాతో భారత్ విజయం

న్యూజిలాండ్‌తో రెండో వన్డేకి టీమిండియా రెడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2023
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన మొదటి వన్డే అభిమానులకు మంచి కిక్‌ను ఇచ్చింది. ఇటు శుభ్‌మన్ గిల్, అటు బ్రాస్‌వెల్ ఉప్పల్ స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు. దీంతో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కివిస్‌పై భారత్ పైచేయి సాధించింది. జనవరి 21న రెండో వన్డే రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో 1:30 PMకి ప్రసారం కానుంది. వన్డేల్లో ఇప్పటివరకూ భారత్, న్యూజిలాండ్ 114 మ్యాచ్‌లో తలపడ్డాయి. ఇందులో భారత్ 56 మ్యాచ్‌లో విజయం సాధించింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో నెగ్గింది. భారత్ చివరిసారిగా 2019లో NZపై సిరీస్‌ను గెలుచుకుంది

టీమిండియా

ఇరు జట్లలోని సభ్యులు..

టీమిండియా ఓపెనర్ గిల్ డబుల్ సెంచరీతో ఫామ్‌లో ఉండగా.. మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాడు. న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ స్నాంటర్ కోహ్లీ వికెట్ తీసి, అర్ధ సెంచరీతో రాణించాడు. బ్రాస్వె‌ల్ తిరిగి ఫామ్‌లోకి వస్తే టీమిండియా బౌలర్లకు కష్టాలు తప్పవు. భారత్ (ప్రాబబుల్ ఎలెవన్): రోహిత్‌శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌గిల్, విరాట్‌కోహ్లీ, ఇషాన్‌కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌పాండ్యా, వాషింగ్టన్‌సుందర్, శార్దూల్‌ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ న్యూజిలాండ్ (ప్రాబబుల్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్