భారత్‌తో వన్డే సిరీస్‌కు సై అంటున్న న్యూజిలాండ్
భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది. ఇప్పటికే శ్రీలంకతో వన్డే సిరీస్ సాధించిన టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించి, ఆత్మ విశ్వాసంతో ఉంది. భారత్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా పైచేయిగా నిలిచింది. మొదటి వన్డే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆరు వన్డే మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మూడుసార్లు విజయం సాధించింది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెటవర్క్ లో 1:30 PM ప్రసారం కానుంది.
ఇరు జట్లలోని సభ్యులు..
వన్డేల్లో భారత్, న్యూజిలాండ్ 113 మ్యాచ్ లో తలపడ్డాయి. ఇందులో భారత్ 55 మ్యాచ్ లో విజయం సాధించింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్ ల్లో నెగ్గింది. భారత్ చివరిసారిగా 2019లో NZపై సిరీస్‌ను గెలుచుకుంది భారత్ (ప్రాబబుల్ ఎలెవన్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్. న్యూజిలాండ్ (ప్రాబబుల్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్ & వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్, లాకీఫెర్గూసన్.