టెస్టులో చరిత్రను తిరగరాసిన రవిచంద్రన్ అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా వెటనర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో చరిత్రను సృష్టించాడు. టెస్టు క్రికెట్లో 450 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాగపూర్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో అలెక్స్ క్యారీని అశ్విన్ ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు.
2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ టీమిండియా తరుపున అత్యంత విజయవంతమైన ఆఫ్ స్పిన్నర్ బౌలర్ గా నిలిచాడు. గతంలో డేల్ స్టెయిన్ 439 వికెట్లు తీయగా.. దాన్ని గతేడాది అశ్విన్ అధిగమించాడు.
గతేడాది శ్రీలంకతో జరిగిన తొలిటెస్టులో డిసిల్వాను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ వికెట్ల పరంగా రిచర్డ్ హ్యాడ్లీ (431)ను అధిగమించిన విషయం తెలిసిందే.
రవిచంద్రన్ అశ్విన్
కుంబ్లే రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్
అశ్విన్ 89 టెస్టు మ్యాచ్‌లోనే 450 వికెట్లు సాధించి ఈ ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 93 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు.
2005లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో కుంబ్లే తన 450వ వికెట్‌ను పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్‌తో 18 ఏళ్ల కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.
ఆసీస్‌పై 18 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 31.48 సగటుతో 89 వికెట్లు తీశాడు. 2017లో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా చివరి సిరీస్ లో అశ్విన్ 21 వికెట్లు పడగొట్టాడు.