Page Loader
ముంబాయి ఇండియన్స్‌కు సేవలందించనున్న టీమిండియా కెప్టెన్
ముంబై ఇండియన్స్ తరుపున ఆడనున్న హర్మన్ ప్రీత్ కౌర్

ముంబాయి ఇండియన్స్‌కు సేవలందించనున్న టీమిండియా కెప్టెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2023
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ వేలానికి 409 మంది మహిళా క్రికెటర్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఇందులో నుంచి ఐదు ఫ్రాంఛైజీలు కలిసి అత్యధికంగా 90మంది కొనుగోలు చేయనున్నారు. ప్రతి ప్రాంఛైజీ పర్సులో రూ.12 కోట్లు ఉండనున్నాయి. వేలంలో పాల్గొనే 409 మంది మహిళా ప్లేయర్లలో 246 మంది స్వదేశీ ప్లేయర్లు కాగా, 163 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ ఎడిషన్‌లో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వేలం మంచి ధర పలికింది

హర్మన్ ప్రీత్

రూ.1.8 కోట్లు పలికిన హర్మన్ ప్రీత్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ వేలంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటిపడ్డాయి. చివరికి ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్ ప్రీత్ కౌర్ రూ.1.8 కోట్లకు దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ 147 టీ20 మ్యాచ్ లు ఆడి 2956 పరుగులు చేసింది. మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ప్లేయర్ గా హర్మన్ ప్రీత్ నిలిచింది. ఇందులో తొమ్మిది అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది. రైట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ 32 వికెట్లను కూడా తీసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై ఇండియన్స్ తరుపున ఆడనున్న హర్మన్ ప్రీత్ కౌర్