Page Loader
స్మృతి మంధానకు అదరిపోయే ధర
బెంగళూరు తరుపున ఆడనున్న స్మృతి మంధాన

స్మృతి మంధానకు అదరిపోయే ధర

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2023
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం నేడు ముంబాయిలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా లీగ్ వేలం మల్లికా సాగర్ నేతృత్వంలో నిర్వహించారు. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్త 90 బెర్తుల కోసం 409 క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన భారీ ధరకు అమ్ముపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ రూ.3.4కోట్లకు మంధానను కొనుగోలు చేసింది. ఇంకా డాషింగ్ ఇండియన్ ఓపెనర్ స్మృతి మంధాన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనుంది

స్మృతి మంధాన

ఆసీస్ ఆల్ రౌండర్ ఎలీన్ పెర్రీకి రూ.1.70 కోట్లు

గత కొన్నేళ్లుగా స్మృతి మంధాన భారత బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గా నిలిచింది. టీ20ల్లో 2,651 పరుగులు చేసింది. ఇందులో మంధాన 20 అర్ధ సెంచరీలను చేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన మంధాన 18.62 సగటుతో 298 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్‌ను బెంగళూరు రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఆసీస్ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీని బెంగళూరు రూ. 1.70 కోట్లకు దక్కించుకుంది.