న్యూజిలాండ్‌కు భారీ షాక్, కీలక పేసర్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ కైలీ జెమీషన్ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. జెమిషన్ వెన్నునొప్పితో కొంతకాలంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. గాయం మళ్లీ తిరగబడటంతో జట్టు నుంచి తప్పుకున్నాడు.
అదే విధంగా మాట్ హెన్రీ కూడా తన భార్య డెలవరీ కోసం జట్టు నుంచి దూరమయ్యాడు. వారి స్థానంలో జాకబ్ డఫీ, స్కాట్ కుగ్గేలీజ్న్ లు నియామకయ్యారు.
ఫిబ్రవరి 16న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే జెమీషన్ కు స్కానింగ్ చేయగా ఫ్రాక్చర్ ఉన్నట్లు గుర్తించామని అందుకోసమే అతనికి విశ్రాంతినిచ్చామని హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పాడు.
జేమీసన్
జేమీసన్‌కు ఆరువారాల పాటు విశ్రాంతి
2020లో భారత్‌పై అరంగేట్రం చేసినప్పటి నుంచి జేమీసన్ 16 టెస్టుల్లో 72 వికెట్లు పడగొట్టాడు. ఐదు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా క్రైస్ట్‌చర్చ్‌లో పాకిస్తాన్‌పై 5/69-6/48తో రాణించిన విషయం తెలిసిందే.
జేమీసన్ చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కనిపించాడు. అయితే ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన రెండో టెస్టులో బౌలింగ్ చేసినప్పుడు జేమీసన్ గాయపడ్డాడు. దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.