Page Loader
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకున్న మోర్గాన్

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2023
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌కు 2019లో క్రికెట్‌ ప్రపంచకప్‌ సాధించిపెట్టిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఆటకు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. 2022 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఇప్పటి వరకు మోర్గాన్ 126 వన్డేలు, 72 టీ20లకు ఇంగ్లడ్ తరుపున నాయకత్వం వహించాడు. వైట్-బాల్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. మోర్గాన్ ఇటీవల SAటీ20 లీగ్‌లో కనిపించిన విషయం తెలిసిందే. మోర్గాన్ వన్డేల్లో 248 మ్యాచ్‌లు ఆడాడు. 39.29 సగటుతో 7,701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు చేశాడు. T20I లలో 2,458 పరుగులు చేశాడు. మోర్గాన్ 16 టెస్టుల్లో 700 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి.

మోర్గాన్

ఐర్లాండ్ తరుపున ఆడిన మోర్గాన్

మోర్గాన్ 2006 నుంచి 2009 వరకు ఐర్లాండ్ జట్టు తరుపున ఆడాడు. ఆ తర్వాత 2009 నుంచి ఇంగ్లండ్ జట్టుకు మారాడు. 2006లో స్కాట్లాండ్‌తో తొలి వన్డే, 2022 జూన్‌లో నెదర్లాండ్స్‌తో చివరి వన్డే ఆడాడు. అదేవిధంగా 2009లో నెదర్లాండ్స్‌తో తొలి టీ20, 2022 జనవరిలో వెస్టిండీస్‌తో చివరి టీ20లో పార్టిసిపేట్‌ చేశాడు. 2015 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గా అలిస్టర్ కుక్ స్థానంలో మోర్గాన్ నాయకత్వ బాధ్యతలను అందుకున్నాడు లార్డ్స్‌లో జరిగిన చారిత్రాత్మక ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లాండ్‌కు మొట్టమొదటి ప్రపంచ కప్‌ను అందించాడు. ఇంకా క్రికెట్లో వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా బ్రాడ్ కాస్టర్లతో తన అనుబంధం కొనసాగుతుందని మోర్గాన్ స్పష్టం చేశాడు.