Page Loader
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్  జోరు కొనసాగించేనా..?
టీమిండియాకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది

ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగించేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐదుసార్లు ట్రోఫిని గెలిచిన అంబాని జట్టు.. ప్రస్తుతం మహిళల ఐపీఎల్‌పై ఫోకస్ పెట్టింది. ఏకంగా టీమిండియా కెప్టెనే తమవైపు లాక్కుంది. మొత్తం 12 కోట్లు వెచ్చింది 17 మంది ఆటగాళ్లను తీసుకుంది. భారత మహిళల జట్టుకు నాయకత్వం వహిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబైకి చెందిన జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నటాలీ-స్కివర్ బ్రంట్‌ను ఏకంగా రూ.3.2కోట్లకు కొనుగోలు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్‌కు రూ.1.8 కోట్లు, టీమిండియా ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ రూ. 1.9 కోట్లు, న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్ కి కోటి, యాస్టికా భాటియాను రూ. 1.5 కోట్లలను చెల్లించింది. ప్రస్తుతం ముంబై జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తోంది.

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ జట్టు ఇదే

కౌర్ టీ20ల్లో మెరుగైన ప్రదర్శనతో అదరగొట్టింది. మొత్తం తొమ్మిది అర్ధ సెంచరీలతో 2,956 పరుగులు చేసింది. స్పిన్ విభాగంలో బౌలింగ్ చేసే సత్తా కూడా కౌర్‌కు ఉంది. టీ20ల్లో అత్యధిక విజయాలందించిన కెప్టెన్సీలో మూడో స్థానంలో కౌర్ ఉంది. వస్త్రాకర్ మిడిలార్డర్ హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉంది. దీంతో ఈసారి ముంబై జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయోన్, హుమైరా కాజీ, ప్రియాంక, ప్రియాంక, జి. కలిత, నీలం బిష్ట్.