Page Loader
జస్ప్రీత్ బుమ్రాను తప్పించిన బీసీసీఐ..!
గాయం కారణంగా టీమిండియాకు దూరమైన బుమ్రా

జస్ప్రీత్ బుమ్రాను తప్పించిన బీసీసీఐ..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2023
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే టీమిండియా కు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. నేరుగా ఐపీఎల్‌లో మైదానంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు, మార్చి 17న జరగనున్న వన్డేలకు సెలక్టర్లు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో జస్ప్రీత్‌బుమ్రాకు చోటు దక్కలేదు. దీంతో అతడు పూర్తిగా ఫిట్‌నెస్ సాధించకపోవడమే ఇందుకు కారణం. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు బుమ్రాని అందుబాటులో ఉంచేందుకు బీసీసీఐ అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. జనవరి 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 30 టెస్టుల్లో 128 వికెట్లు పడగొట్టాడు. 72 వన్డేలు ఆడిన బుమ్రా 121 వికెట్లను తీశాడు.

జస్ప్రీత్ బుమ్రా

ఐపీఎల్‌లో ఆడనున్న జస్ప్రీత్ బుమ్రా..?

టీ20 వరల్డ్ కప్ తర్వాత, భారత్ మూడు టీ20లు, వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ తర్వాత మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం బంగ్లాదేశ్‌కు వెళ్లింది. బుమ్రా ఈ రెండు పర్యటనలకు దూరమయ్యాడు. వెన్ను సమస్య కారనంగా బుమ్రా గతేడాది సెప్టెంబర్ నుంచి ఆటకు దూరమయ్యాడు. జస్ప్రిత్‌బుమ్రా. నేరుగా ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపునే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది. మార్చి 1న ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.