Page Loader
మైదానంలోకి అడుగుపెట్టిన యార్కర్ల కింగ్ బుమ్రా
NCAలో తిరిగి బౌలింగ్‌ను ప్రారంభించిన బుమ్రా

మైదానంలోకి అడుగుపెట్టిన యార్కర్ల కింగ్ బుమ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2023
09:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్టార్ పేస్ బౌలర్ జస్పీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అలాంటి పేసర్ సేవలను కొన్నాళ్లుగా టీమిండియా కోల్పోయింది. వెన్ను గాయంతో గతేడాది సెప్టెంబర్ తర్వాత బుమ్రా ఇండియా టీమ్‌కు ఆడలేదు. టీ20 వరల్డ్ కప్‌కు దూరం కావడంతో ఆ ప్రభావం టీమిండియా అవకాశాలను ప్రభావితం చేసింది. స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బౌలింగ్‌ను తిరిగి ప్రారంభించినట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో జరిగే మూడు, నాలుగో టెస్టులకు భారత జట్టులో చేరే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 9న స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్ 2-0తో విజయం సాధించాలి

బుమ్రాం

చివరి రెండు టెస్టులకు అందుబాటులో బుమ్రా..?

బుమ్రా తిరిగి నెట్స్ లో బౌలింగ్ ని తిరిగి ప్రారంభించడంతో భారత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశాస్తున్నారు. NCAలో బౌలింగ్ చేయడంతో అతడు మంచి ఫిట్ నెస్ ఉన్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ప్రకటించింది. వెన్ను సమస్య నుండి బుమ్రా తప్పించుకుంటే, చివరి రెండు టెస్టులకు బుమ్రా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. జనవరి 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా 30 గేమ్‌లలో 21.99 సగటుతో 128 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో కేవలం నాలుగు టెస్టులు ఆడి, 14 వికెట్లు పడగొట్టాడు.