Bumrah is Back: యార్కర్ల కింగ్ బుమ్రా వచ్చేశాడు
యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రా టీం ఇండియా జట్టులోకి వచ్చేశాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. నాలుగు నెలలుగా టీం ఇండియాకు దూరంగా ఉన్న బుమ్రా.. మళ్లీ జట్టులోకి తిరిగి రావడంతో టీం ఇండియా బౌలింగ్ లో బలపడింది. ఇండియన్ క్రికెట్ టీం పేస్ బౌలర్ జస్పిత్ బుమ్రాకు అన్ని ఫార్మాట్లో వికెట్లు తీయగల సత్తా ఉంది. టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా దూరం కావడంతో టీమిండియా గెలుపుపై ఆ ప్రభావం పడింది. కొన్ని నెలలుగా జట్టుకు దూరం కావడంతో టీం ఇండియా అశించిన స్థాయిలో రాణించలేదు. అయితే మళ్లీ జట్టులోకి రావడంతో టీం ఇండియా బలం పుంజుకుంది.
వన్డే జట్టులోని సభ్యులు
శ్రీలంకతో జనవరి 10 నుండి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ లో బుమ్రా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. నేషనల్ క్రికెట్ అకాడమీ బుమ్రా ఫిట్ ఉన్నట్లు సర్టిఫికెట్ ఇవ్వడంతో వన్డే ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. జస్పిత్ బుమ్రాను ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ శ్రీలంకతో జరిగే మూడు వన్డేలకు ఎంపిక చేసింది. వన్డే జట్టులోని సభ్యులు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్