సూపర్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్
ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా జరిగిన మొదటి వన్డేలో అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. మొత్తం మీద రాయ్ వన్డేల్లో 11వ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 4వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా జాసన్ రాయ్ చరిత్రకెక్కాడు. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్‌కు రాయ్, డేవిడ్ మలన్ 146 పరుగులు జోడించి, శుభారంభాన్ని అందించారు. సౌతాఫ్రికా బౌలర్లపై రాయ్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 79 బంతుల్లో సెంచరీని పూర్తి చేశారు. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ విఫలం కావడంతో.. 44.2 ఓవర్లకు 271 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌటైంది.
జాసన్ రాయ్ సాధించిన రికార్డులివే
జాసన్ రాయ్ ఇంగ్లండ్ తరుపున 4వేల పరుగులు పూర్తి చేసిన 12 అటగాడిగా చరిత్రకెక్కాడు. 111 మ్యాచ్‌లు ఆడి 40.25 సగటుతో 4,106 పరుగులు చేశాడు. వన్డేలో ఇంగ్లండ్ తరుపున 9 సెంచరీలు చేసి 4వ అటగాడి నిలిచాడు. జో రూట్ (16), ఇయాన్ మోర్గాన్ (13), ట్రెస్కోథిక్ 12 సెంచరీలు చేసి రాయ్ కంటే ముందు ఉన్నారు. రాయ్ వన్డేలో 21 అర్ధ సెంచరీలను చేశాడు. వాన్ డెర్ డస్సెన్ 117 బంతుల్లో 111 పరుగులు, డేవిడ్ మిల్లర్ 53 పరుగులు చేసి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించారు.