అరుదైన రికార్డుకు చేరువలో కేన్ విలియమ్సన్
టెస్టులో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డులను బద్దలు కొట్టాడు. వెల్లింగ్టన్ లోని ఇంగ్లండ్ జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు సంచలన రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో ఆల్ టైమ్ స్కోరర్‌గా అవతరించేందుకు విలియమ్సన్ 33 పరుగుల దూరంలో ఉన్నాడు. స్వదేశంలో ఆడిన టెస్టుల్లో 4,000 పరుగుల మార్క్‌పై కూడా ఆయన దృష్టి సారించాడు. న్యూజిలాండ్‌కు చెందిన అత్యుత్తమ బ్యాటర్లలో విలియమ్సన్ ఒకడు. దశాబ్ద కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించారు. మాజీ NZ బ్యాటర్ రాస్ టేలర్ ప్రస్తుతం టెస్టులో 7,683 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నారు.
విలియమ్సన్ సాధించిన రికార్డులివే
విలియమ్సన్ టెస్టులో 2010లో భారత్‌పై అరంగేట్రం చేశాడు. 91 టెస్టుల్లో 7,651 పరుగులను సాధించాడు. ఇందులో 25 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలున్నాయి. స్వదేశంలో, విలియమ్సన్ 3,794 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన 15 టెస్టుల్లో విలియమ్సన్ 859 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలున్నాయి. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ విలియమ్సన్ ఎనిమిది సార్లు ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 0-1తో వెనుకబడి ఉంది. బే ఓవల్‌లో జరిగిన తొలి టెస్టులో 267 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయింది. రెండో టెస్టు ఫిబ్రవరి 24న ప్రారంభం కానుంది.