Page Loader
మొదటి టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్‌టిక్నర్
టిక్నర్ 2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

మొదటి టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్‌టిక్నర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2023
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్ టిక్నర్ సత్తా చాటాడు. రైట్ ఆర్మ్ పేసర్ ఇప్పుడు టెస్టులో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెన్ డకెట్ పెవిలియానికి పంపాడు. టిక్నర్ టెస్టుల్లో తన తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు వేసి 1/72 తో రాణించాడు. టిక్నర్ అక్టోబర్ 13, 1993న నేపియర్‌లో జన్మించాడు. అతను దేశవాళీ క్రికెట్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లకు ప్రాతినిధ్యం వహించాడు టెస్ట్ అరంగేట్రం చేయడానికి ముందు టిక్నర్ 61 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 178 వికెట్లను సొంతం చేసుకున్నాడు. గత సీజన్లో ప్లంకెట్ షీల్డ్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లలో ఏడు వికెట్లను పడగొట్టాడు.

టిక్నర్

టిక్నర్ సాధించిన రికార్డులివే

టిక్నర్ ఫిబ్రవరి 2019లో భారత్‌తో జరిగిన T20Iలో అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. అతని తొలి వన్డే గతేడాది మార్చిలో నెదర్లాండ్స్‌తో జరిగింది. ఇప్పటి వరకు తొమ్మిది వన్డేల్లో 38.31 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు. 15 టీ20ల్లో 17 వికెట్లు కూడా సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 325/9 వద్ద డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ తరఫున నీల్ వాగ్నర్ 4 వికెట్లు పడగొట్టాడు. కివీస్ తొలి రోజు ఆటముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.