Page Loader
న్యూజిలాండ్ లెఫ్టార్మ్ పేసర్ నీల్ వాగ్నర్ అరుదైన ఘనత
టెస్టులో 250 వికెట్లు సాధించిన వాగ్నర్

న్యూజిలాండ్ లెఫ్టార్మ్ పేసర్ నీల్ వాగ్నర్ అరుదైన ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2023
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ లెఫ్మార్మ్ పేసర్ నీల్ వాగ్నల్ టెస్టులో అరుదైన ఘనతకు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో 4/82 అకట్టున్నాడు. ఈ మ్యాచ్‌లో జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ ఫోక్స్, జాక్ లీచ్ పెవిలియానికి పంపి టెస్టు కెరీర్‌లో రికార్డును సాధించాడు. వాగ్నర్ టెస్టు క్రికెట్‌లో 250 వికెట్లను పూర్తిగా చేసిన ఐదో న్యూజిలాండ్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వాగ్నర్ న్యూజిలాండ్ తరపున 251 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వికెట్ల పరంగా రిచర్డ్‌హ్యాడ్లీ (431), వెటోరి (361), టిమ్‌సౌథీ (355), బౌల్ట్ (317) వికెట్లు తీసి వాగ్నర్ కంటే ముందు ఉన్నారు. తర్వాతి స్థానంలో మైకేల్ హోల్డింగ్ (249), రిచర్డ్ బెనాడ్ (248), మాథ్యూహాగార్డ్ (248) ఉన్నారు.

వాగ్నర్

ఇంగ్లండ్‌పై 50 వికెట్లు తీసిన బౌలర్‌గా వాగ్నర్

అదే విధంగా వాగ్నర్ ఇంగ్లండ్ పై 50 వికెట్ల తీసిన నాలుగో బౌలర్ గా నిలిచాడు. ఇంగ్లండ్ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 325/9 స్కోరు చేసింది. ఓపెనర్ జాక్ క్రాలే (4) త్వరగా ఔట్ అయినా బెన్ డకెట్ (84) ఆలీ పోప్ (42) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు.కేవలం 36 బంతుల్లోనే డకెట్ అర్ధ సెంచరీ సాధించాడు. చివరికి అరంగేట్ర పేసర్ బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు