Page Loader
తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన బెన్ డకట్
68 బంతుల్లో 84 పరుగులు చేసిన డకట్

తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన బెన్ డకట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2023
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బెన్ డకెట్ వేగంగా ఆడి కేవలం 68 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశారు. మౌంట్ మౌంగానుయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జాక్ క్రాలే (4) త్వరగా ఔట్ కావడంతో ఇంగ్లండ్‌కు మంచి అరంభం లభించలేదు.అయినప్పటికీ, డకెట్, ఓలీ పోప్ (42)తో జతకట్టి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వారిద్దరు రెండో వికెట్‌కు 99 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేవలం 36 బంతుల్లోనే డకెట్ అర్ధ సెంచరీ సాధించాడు. చివరికి అరంగేట్ర పేసర్ బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్ డకట్ ఔటయ్యాడు.

డకెట్

డకెట్ సాధించిన రికార్డులివే

డకెట్ ప్రస్తుతం ఎనిమిది టెస్టుల్లో 87.32 సగటుతో 551 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలున్నాయి. 2022లో పాకిస్థాన్ సిరీస్‌కు ముందు డకెట్ తన చివరి టెస్టును 2016లో ఆడాడు. డకెట్ టెస్టులో మెరుగన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గతేడాది జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూరులో కేవలం 10 మ్యాచ్ లు ఆడి 1,012 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధసెంచరీలు, మూడు సెంచరీలున్నాయి. గతేడాది పాకిస్తాన్ టెస్టు సిరీస్ లో మూడు మ్యాచ్‌లు ఆడి 357 పరుగులు చేశాడు. డకెట్ అద్భుత ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్‌ 3-0తో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.