ఇంగ్లండ్‌తో పోరుకు న్యూజిలాండ్ సై
ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఫిబ్రవరి 16న ప్రారంభ కానుంది. న్యూజిలాండ్ తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సిద్ధమైంది. అలాగైనా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ హోరా హోరీగా తలపడనున్నాయి. మౌంట్ మౌంగానుయ్‌లోని బే ఓవల్ ఇప్పటి వరకు మూడు టెస్టులు జరిగాయి. ఇందులో బౌలింగ్ ఎంచుకున్న జట్లు రెండు సార్లు గెలిచాయి. మొదటి రెండు రోజులు బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించగా.. చివరి భాగంలో పేసర్లు అధిపత్యం వహించే అవకాశం ఉంది. మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉదయం 6.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇరు జట్లలోని సభ్యులు
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మద్య ఇప్పటివరకూ 110 టెస్టులు జరిగాయి. ఇందులో ఇంగ్లండ్ 51 సార్లు విజేతగా నిలిచింది. 21 టెస్టుల్లో స్టువర్ట్ బ్రాడ్ 84 వికెట్లు సాధించాడు. జో రూట్ 16 టెస్టుల్లో 1,388 పరుగులు చేసి సత్తా చాటాడు. న్యూజిలాండ్ : టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ బ్లుండెల్ (వికెట్-కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, టిమ్ సౌతీ (కెప్టెన్), నీల్ వాగ్నర్, జాకబ్ డఫీ, స్కాట్ కుగ్గెలెయి ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్‌స్టోక్స్ (కెప్టెన్), బెన్‌ఫోక్స్ (వికెట్ కీపర్), ఆలీ రాబిన్సన్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ఆండర్సన్