Page Loader
Mahmudullah: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్

Mahmudullah: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

సుదీర్ఘకాలంగా బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆల్‌రౌండర్ మహ్మదుల్లా (Mahmudullah) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. 39 ఏళ్ల మహ్మదుల్లా ఇప్పటికే 2021లో టెస్టులకు, 2024లో టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. "నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. నా ప్రయాణంలో నాకు ఎప్పుడూ అండగా నిలిచిన సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని మహ్మదుల్లా తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నాడు.

వివరాలు 

మహ్మదుల్లా గణాంకాలు 

బంగ్లాదేశ్ తరఫున అత్యుత్తమ క్రికెటర్లలో మహ్మదుల్లా ఒకడు. ముష్ఫీకర్ రహీమ్, తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు (11,047) చేసిన ఆటగాడు మహ్మదుల్లానే. స్పిన్ ఆల్‌రౌండర్‌గా 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతను, ఎక్కువగా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. మహ్మదుల్లా 50 టెస్టుల్లో 2,914 పరుగులు చేసి 43 వికెట్లు పడగొట్టాడు. 239 వన్డేల్లో 5,689 పరుగులతో పాటు 82 వికెట్లు సాధించాడు. 141 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 2,444 పరుగులు చేసి 41 వికెట్లు తీసి తన ప్రతిభను చాటాడు.