
ఇంగ్లండ్‌తో పోరుకు బంగ్లాదేశ్ సై
ఈ వార్తాకథనం ఏంటి
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తలపడేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. మార్చి 1 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోపక్క ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. అయితే ఇరు జట్లు వన్డే సిరీస్ పై కన్నేయడంతో సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉండనుంది.
వన్డేల్లో బంగ్లాదేశ్ పై ఇంగ్లండ్ మంచి రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 21 వన్డేల్లో తలపడ్డాయి. అయితే ఇంగ్లండ్ 17 సార్లు విజేతగా నిలిచింది. మిగిలిన నాలుగు మ్యాచ్ లను మాత్రమే బంగ్లాదేశ్ గెలిచింది. బంగ్లాదేశ్ గడ్డపై ఇంగ్లండ్ ఎనిమిది విజయాలు, రెండు పరాజయాలను మూటకట్టుకుంది.
ఇంగ్లండ్
వన్డే సిరీస్‌పై ఇంగ్లండ్, బంగ్లాదేశ్ గురి
బంగ్లాదేశ్ ప్లేయర్ లిట్టన్ దాస్ గతేడాది 13 వన్డేల్లో 577 పరుగులు చేశాడు. మహ్మదుల్లా 15 వన్డేల్లో 410 పరుగులు చేశాడు. వెటరన్ ఆల్ రౌండర్ షకీబ్ అల్‌హసన్ గతేడాది కేవలం తొమ్మిది వన్డేల్లో 235 పరుగులు, 17 వికెట్లు పడగొట్టాడు. మెహిదీ హసన్ కూడా 15 వన్డేల్లో 330 పరుగులతో పాటు 24 వికెట్లు తీయడం విశేషం.
ఇంగ్లండ్ ప్లేయర్ రీస్‌టాప్లీ ఏడు వన్డేల్లో 13 వికెట్లు పడగొట్టాడు. జనవరి 2023లో దక్షిణాఫ్రికా జరిగిన వన్డే సిరీస్‌లో కెప్టెన్ బట్లర్ మూడు మ్యాచ్‌లో 261 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో డేవిడ్‌మలన్ 189 పరుగులతో సత్తా చాటిన విషయం తెలిసిందే. స్టార్ పేసర్ జోఫ్రాఆర్చర్ సిరీస్ చివరి మ్యాచ్‌లో 6/40తో అకట్టుకున్నాడు.