NZ Vs Eng: వారెవ్వా.. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బకు బిత్తిరిపోయిన బ్యాటర్లు
వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ జాకోలీచ్ అద్భుత బౌలింగ్‌తో అకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌కు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఘనమైన ఆరంభాన్ని అందించారు. కేన్ విలియమ్సన్ మెరుపు సెంచరీతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. జాకోలిచ్ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో లీచ్ 61.3 ఓవర్లలో 157 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 ఓవర్లు మెయిడిన్లు కావడం గమనార్హం. లీచ్ కొన్నేళ్లుగా టెస్టుల్లో ఇంగ్లండ్‌కు కీలక బౌలర్‌గా మారాడు. ఈ ఏడాది ప్రారంభంలో టెస్టు క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేసిన 49వ ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు.
టెస్టులో 120 వికెట్లు తీసిన లీచ్
మైకేల్ బ్రేస్‌వెల్ రెండు వికెట్లు తీయగా, టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్ తలో వికెట్ తీసుకున్నారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లీచ్ 17 ఓవర్లలో 80 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. మార్చి 2018లో న్యూజిలాండ్‌పై లీచ్ టెస్టు అరంగేట్రం చేశాడు. టెస్టులో 34.28 సగటుతో 120 టెస్ట్ వికెట్లను తీసిన ఆటగాడిగా లీచ్ నిలిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 స్కోరు చేసి డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌట్ అయింది.