Page Loader
కేన్ విలియమ్సన్ ఘనత; న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు
న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు

కేన్ విలియమ్సన్ ఘనత; న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు

వ్రాసిన వారు Stalin
Feb 27, 2023
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వెల్లింగ్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 2వ టెస్టులో 4వ రోజున అతను రాస్ టేలర్‌ను అధిగమించాడు. అంతేకాదు విలియమ్సన్ తన 26వ సెంచరీని కూడా ఈ ఫార్మాట్‌లో పూర్తి చేసుకున్నారు. విలియమ్సన్ 2010లో భారత్‌పై అరంగేట్రం చేశాడు. ఒక దశాబ్దం పాటు సాగిన కెరీర్‌లో, అతను 92 టెస్టుల్లో 53.33 సగటుతో 7,787 పరుగులు చేశాడు. వెల్లింగ్టన్ టెస్టుకు ముందు, టేలర్ టెస్ట్ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున టాప్ స్కోరర్. టైలర్ అతను 112 మ్యాచ్‌లలో 44.66 సగటుతో 7,683 పరుగులు సాధించాడు.

న్యూజిలాండ్

26వ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు

విలియమ్సన్, టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమే టెస్ట్ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున 7,000కంటే ఎక్కువ పరుగులు చేశారు. న్యూజిలాండ్ గొప్ప కెప్టెన్లలో ఒకరైన ఫ్లెమింగ్ 7,172 పరుగుల వద్ద రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగో టెస్టులో కెరీర్‌లో 26వ సెంచరీ చేసిన కేన్ మామ, సుదీర్ఘ ఫార్మాట్‌లో 20 సెంచరీలకు పైగా ఉన్న ఏకైక న్యూజిలాండ్ బ్యాటర్‌గా మిగిలిపోయాడు. టేలర్ 19సెంచరీలతో విలియమ్సన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో న్యూజిలాండ్ తన పోరాట పటిమను కనబర్చింది. ఓవర్ నైట్ స్కోరు 202/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ కేన్ మామ సెంచరీ(136)తో జట్టు 483పరుగులను చేసింది. దీంతో ప్రత్యర్థికి 258 డిఫెండింగ్ టార్గెట్‌ను నిర్దేశించింది.