LOADING...
Eng vs Nz Test: కేన్ మామను తొమ్మిదోసారి ఔట్ చేసిన జేమ్స్ అండర్సన్

Eng vs Nz Test: కేన్ మామను తొమ్మిదోసారి ఔట్ చేసిన జేమ్స్ అండర్సన్

వ్రాసిన వారు Stalin
Feb 25, 2023
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జేమ్స్ ఆండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో కేన్ విలియమ్సన్‌ను ఏకంగా తొమ్మిదోసారి ఔట్ చేశాడు. ఈ ఫార్మాట్‌లో విలియమ్సన్‌‌ను ఆరు సార్లకు మించి ఏ బౌలర్ కూడా ఔట్ చేయలేదు. ఆండర్సన్ ఒక్కరే తొమ్మిసార్లు కేన్ మామను తొమ్మిది సార్లు పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం టెస్ట్ బౌలర్ ర్యాంగింగ్‌లో అండర్సన్ నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. 40 ఏళ్ల వయసులో అండర్సన్ బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. న్యూజిలాండ్ అత్యుత్తమ ఆటగాళ్లలో విలియమ్సన్ ఒకరు. విలియమ్సన్- అండర్సన్ 20‌టెస్ట్ ఇన్నింగ్స్‌లో తలపడ్డారు. ఇందులో ఏకంగా తొమ్మిది సార్లు విలియమ్సన్‌ను ఔట్ చేశాడు. తొమ్మిది ఔట్లలో న్యూజిలాండ్‌లో ఆరు, మిగిలిన మూడు ఇంగ్లండ్‌లో నమోదయ్యాయి.

టెస్టు

ఇంగ్లండపై విలియమ్సన్‌ పేలవ ప్రదర్శన

మరో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ విలియమ్సన్‌ను సుధీర్ఘ ఫార్మాట్‌లో ఆరుసార్లు అవుట్ చేసిన తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టుపై విలియమ్సన్ ఆట తీరు అంత గొప్పగా లేదని చెప్పాలి. ఇంగ్లండ్‌తో విలియమ్సన్‌ 16 టెస్టులు ఆడగా, 33.19 సగటుతో కేవలం 863 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలు, మూడు డకౌట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై, అతను 25.5 (ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ) స్వల్ప సగటుతో 357 పరుగులు సాధించాడు. స్వదేశంలో 42.16 ( 2సెంచరీలు, 3హాఫ్ సెంచరీలు) సగటుతో 506 పరుగులు చేశారు. స్వదేశంలో అతని ప్రదర్శన మెరుగ్గా ఉంది.