టెస్టు సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్
టెస్టుల్లో ఇంగ్లండ్ సంచలనాత్మక మార్పులను తీసుకొస్తోంది. ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలను తీసుకున్నప్పటీ నుంచి ఇంగ్లండ్ అద్భుతంగా రాణిస్తోంది. ఒకప్పుడు టెస్టులో పేలవ ఫామ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్.. ఇప్పుడు టెస్టుల్లో రికార్డులపై గురి పెట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. పిబ్రవరి 24న జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ను గెలవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమిని చవిచూసింది. స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవడానికి ప్రయత్నించింది. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 85 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3వ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదటి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్
పాక్‌లో పాకిస్తాన్‌ను 3-0తో ఇంగ్లండ్ ఓడించింది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ తొలి విజయాన్ని అందుకొని చరిత్రను సృష్టించింది. ఇంగ్లండ్ వరుసగా 12 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 11 విజయాలు నమోదు చేసి సత్తా చాటింది ప్రస్తుతం జరుగుతున్న 2 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో అధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 325/9 స్కోరు చేసి డిక్లరే చేసింది. హ్యారీ బ్రూక్ (89), బెన్ డకెట్ (84) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ 306/10 స్కోరు చేయగా.. టామ్ బ్లండెల్ 138 పరుగులతో చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 374 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 126 పరుగులకు అలౌటైంది.