Tim Southee: ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేసిన టిమ్ సౌథి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 138/7 వద్ద కొట్టుమిట్టాడుతోంది. ఈ టెస్టు ద్వారా సుధీర్ఘ ఫార్మట్లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్సర్ల రికార్డును కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ సమం చేశాడు. ధోనీ టెస్ట్ క్రికెట్లో 78 సిక్సర్లు కొట్టాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సులు బాదిన రెండో భారతీయ ఆటగాడు ధోనీ కావడం గమనార్హం. జో రూట్ వేసిన 81వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన టిమ్ సౌథీ, ధోనీ రికార్డు సమం చేశాడు. అలాగే న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా సౌథి నిలిచాడు.
న్యూజిలాండ్ తరఫున 700 ఆటగాడిగా ఘనత
న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో 70కిపైగా సిక్సర్లు బాదిన ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. బ్రెండన్ మెకల్లమ్, క్రిస్ కెయిర్న్స్, టీమ్ సౌథి. ఇందులో బ్రెండన్ మెకల్లమ్ మాత్రం 100కు పైగా సిక్సర్లు బాదడం గమనార్హం. సౌథి విదేశాల్లో 28 టెస్ట్ సిక్సర్లు బాదాడు. ఈ విషయంలో మాత్రం మెకల్లమ్ రికార్డును సౌథి చెరిపేశారు. విదేశాల్లో మెకల్లమ్ 27 సిక్సర్లను మాత్రమే కొట్టారు. ఈ టెస్టు ద్వారా టిమ్ సౌథి మరో ఘనత సాధించాడు. న్యూజిలాండ్ తరఫున 700 అంతర్జాతీయ వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.